చరణ్‌కి ఈసారి పవన్‌తో ప్రాబ్లమ్‌

ధృవ చిత్రాన్ని దసరాకి విడుదల చేసుకోలేకపోవడంతో సీజన్‌ కాదని తెలిసినా డిసెంబర్‌లో విడుదల చేయక తప్పింది కాదు. సంక్రాంతికి చిరంజీవి 'ఖైదీ నంబర్‌ 150' రిలీజ్‌ వుండడంతో చరణ్‌ చిత్రాన్ని డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేసారు. దీని వల్ల రావాల్సిన వసూళ్ల కంటే తక్కువ వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

పెద్ద సినిమాకి సీజన్‌ చాలా అవసరమనేది తెలిసిన సంగతే. ఎప్పుడూ దసరా లేదా సంక్రాంతికి తన సినిమాల రిలీజ్‌ ప్లాన్‌ చేసుకునే చరణ్‌ ఈసారి సుకుమార్‌తో చేస్తోన్న చిత్రానికి కూడా దసరా ముహూర్తం పెట్టుకున్నాడు. ఇంకా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కాలేదు కానీ త్వరలోనే సెట్స్‌ మీదకి వెళుతోన్న ఈ చిత్రం పూర్తయ్యే వరకు ఏకబిగిన షూటింగ్‌ జరుపుకుంటుంది.

దసరాకి రిలీజ్‌ ప్లాన్‌ అయితే చేసుకుంటున్నారు కానీ ఈసారి పవన్‌కళ్యాణ్‌ చిత్రంతో చెర్రీకి సమస్య వచ్చే అవకాశముంది. త్రివిక్రమ్‌, పవన్‌ల చిత్రాన్ని మార్చిలో మొదలు పెట్టి దసరాకి విడుదల చేయాలని అనుకుంటున్నారు. పవన్‌ రాజకీయ వ్యవహారాల వల్ల లేట్‌ అయితే ఓకే కానీ దసరాకే వచ్చేసిందంటే మాత్రం చరణ్‌ ఇబ్బందుల్లో పడతాడు. 

Show comments