'ఓం నమో వెంకటేశాయ' బాక్సాఫీస్ పర్‌ఫార్మెన్స్ బయ్యర్లని కంట తడి పెట్టిస్తోంది. టాక్ బాగుండడంతో నెమ్మదిగా రైజ్ అవుతుందని అనుకున్న చిత్రం నానాటికీ క్షీణిస్తూనే వుంది. ముప్పయ్ ఆరు కోట్ల బిజినెస్ జరిగిన ఈ చిత్రానికి థియేటర్ల నుంచి పన్నెండు కోట్ల షేర్ కూడా రాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'సింగం 3' చిత్రానికి యావరేజ్ ఓపెనింగ్ వచ్చింది కానీ అదీ గొప్పగా ఏమీ ఆడడం లేదు. ఇరవై కోట్లు రాబట్టాల్సిన ఈ చిత్రం సెకండ్ వీకెండ్‌లో అద్భుతంగా ఆడితే తప్ప బ్రేక్ ఈవెన్ కష్టం. నేను లోకల్ సూపర్‌హిట్ స్థాయిని చేరుకుని ముప్పయ్ కోట్ల షేర్ సాధించే దిశగా సాగుతోంది.
ఈవారం ఘాజీ ఒక్కటే రిలీజ్ అవడంతో మార్కెట్‌లో వున్న సినిమాలకి మరో వారం వెసులుబాటు దొరుకుతుంది. వచ్చే వారం రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి కనుక ఈ వీకెండ్‌ని ఎంతగా క్యాష్ చేసుకోగలిగితే అంత లాభముంటుంది.