సినిమా హిట్ అయితే నిర్మాతలో, హీరోలో డైరక్టర్లకు బహుమతి ఇవ్వడం ఇటీవల కామన్ అయింది. అయితే ఇంకా సినిమా సెట్ మీద వుండగానే, హీరో ఇంకా సెట్ లోకి అడుగు పెట్టకుండానే, డైరక్టర్ కు మాంచి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన వార్త బయటకు వచ్చింది. ఎవరో కాదు. ఎన్టీఆర్ నే ఇలా ఇచ్చింది.
తనకు మాంచి మూడు పాత్రల కథను సెట్ చేసిన డైరక్టర్ కమ్ రైటర్ బాబీకి ఎన్టీఆర్ లక్షల విలువ చేసే రిస్ట్ వాచ్ ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. జయ్ లవకుశ అనే టైటిల్ పెడతారని ప్రచారంలో వున్న ఈ సినిమా షూట్ ఇటీవలే ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఈరోజు నుంచే సెట్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే ఈ గిఫ్ట్ ఇచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి.