వీర తెలంగాణ వాదులు.. కిమ్మనడంలే!

ఫేస్ బుక్ లో తెగ యాక్టివ్ గా ఉండి.. చంద్రబాబును, బాలయ్యబాబును అనునిత్యం చీల్చి చండాడుతూ, ఆంధ్రా- రాయలసీమ వాళ్లపై విరుచుకుపడుతూ, ఆంధ్రను అన్ని విధాలుగానూ వెటకారం చేస్తూ.. కేసీఆర్ ను భుజాన మోసే వీర తెలంగాణ వాదులు ఇప్పుడు వేరే ఇష్యూల గురించి స్పందిస్తున్నారు కానీ, ‘గౌతమిపుత్రశతకర్ణి’ అనే సినిమాకు పన్ను మినహాయింపు మాత్రం మారు మాట్లాడటం లేదు!

కేసీఆర్ ఏం చేస్తే అదే తెలంగాణ వాదం.. అని భాష్యాలు చెబుతూ, తెలంగాణ కాంగ్రెస్ నేతలను కమేడియన్ల కింద జమ కడుతూ.. తెలంగాణ వాదానికి నిర్వచనం ఇస్తున్న వారు ఇప్పుడు కిమ్మనడం లేదు! ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వమే పన్ను మినహాయింపు గురించి స్పందించలేదు. బాలకృష్ణ కూడా ఏపీలో పన్నుమినహాయింపు గురించి విజ్ఞప్తి చేయలేదు, తెలంగాణలో మాత్రమే చేశాడు!

గౌతమిపుత్రశాతకర్ణి.. అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించాడు.. మరి అదే ‘అమరావతి’ సెంటిమెంటును విచ్చలవిడిగా వాడేసుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకూ పన్నుల గురించి మాట్లాడలేదు! బాలయ్య అడగడం.. కేసీఆర్ వరమివ్వడమా! ఎంత బాలకృష్ణ కేసీఆర్ సన్నిహితుడైతే మాత్రం ఇదేంటి? అనేది సగటు తెలంగాణ మనిషి సందేహం!

ఆంధ్ర వాళ్లను తిట్టడం అంటే.. గత యాభై యేళ్ల ప్రముఖులను కాదు ఆదికవి నన్నయ్య విషయంలో కూడా కారుకూతలు కూసిన చరిత్ర ఉంది కేసీఆర్ కు! నన్నయ్య మహాభారతాన్ని అనువదించాడని, సొంతంగా రాసిన ఘనత లేదని.. అర్థం లేని మాటలు మాట్లాడిన వ్యక్తి కేసీఆర్! మరి ఇప్పుడు శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించింది అదే కేసీఆరే! Readmore!

ఇది కేసీఆర్ లో వచ్చిన మార్పా? లేక విభజనతో మారిన సమీకరణాలు.. పెరిగిన కొన్ని సాన్నిహిత్యాల పుణ్యమా! ఫేస్ బుక్కోల్లో తెలంగాణ వాదాన్ని వినిపించే వీర తెలంగాణ వాదులు ఈ సందేహాలను ఇప్పుడు వ్యక్తం చేయడం లేదు. వీరు సైలెంట్ అయ్యారంటే.. ఆంధ్రా ఆధిపత్యానికి వేరే రుజువులెందుకు! 

Show comments