లై టీజర్...భలే వుంది భయ్

అబద్ధం లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తి కాలేదు అన్న ఒక్క మాటతోనే మంచి ఇంప్రెషన్ కలిగించేసాడు దర్శకుడు హను రాఘవపూడి తన లేటెస్ట్ సినిమా లై మీద. నితిన్ ను అవుట్ అండ్ కొత్తగా చూపిస్తూ, తయారవుతున్న ఈ సినిమా టీజర్ విడుదలయింది.

ఎంత సైన్యం వున్నా, శక్తి వంతమైన పంచ పాండవులు వున్నా, భగవానుడు శ్రీకృష్ణుడు వున్నా కూడా అశ్వద్ధామ హత: కుంజరహ: అనే అబద్ధం ఆడక తప్పలేదు కురుక్షేత్రంలో ధర్మరాజు.

సో, లై సినిమాకు దీనికి ఏమిటి సంబంధం? అన్న క్యూరియాసిటీని కలిగించారు టీజర్ తో. అదే సమయంలో యాక్షన్ కింగ్ అర్జున్ పాత్ర కూడా మరింత క్యూరియాసిటీని కలిగించింది. టీజర్ లక్ష్యం సినిమా మీద ఆసక్తి కలిగించడమే అనుకుంటే, ఆ పనిని బాగానే నెరవేర్చింది లై టీజర్.

మణిశర్మకు రీ రికార్డింగ్ లో మాంచి టాలెంట్ వుంది. అది టీజర్ లోనే తొంగిచూసింది. నితిన్ కొత్తగానే కాదు అందంగా కూడా కనిపించాడు. Readmore!

Show comments