సంభవామి అన్న టైటిల్ మొత్తానికి బయటకు వచ్చింది. సంస్కృతం..శివుడి మీద అంటూ ఇలా రకరకాల ఈక్వేషన్లు పెట్టుకుని, ఆఖరికి మురుగదాస్ కృష్ణుడి టైటిల్ బయటకు తెచ్చారు. నిజానికి ఈ టైటిల్ ను గత నెల ఆఖరులోనే ఫైనల్ చేసి మహేష్ కు వినిపించినట్లు తెలుస్తోంది. కానీ మహేష్ పూర్తిగా ఓటు వేయలేదని వినికిడి. చూద్దాం..ఇంకేమన్నా వుంటే ఆలోచించండి అని మాత్రమే అన్నట్లు తెలుస్తోంది.
అయితే ఎందుకయినా మంచిది అని రిజిస్టర్ చేసి వుంచారు. ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఎలాగూ బయటకు వచ్చింది కాబట్టి, అదే ఫిక్స్ చేయడమా ? లేక మరేదైనా ఆలోచించడమా అన్న డైలామా పడి, ఆఖరికి దానికే కట్టుబడిపోవాలని నిర్మాత, దర్శకుడు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ మహేష్ మాత్రం ఇంకా ఓకె అనలేదని వినికిడి.
సహజంగా పెద్ద హీరోల వ్యవహారాలు ఏవయినా, అవి ఎలా వున్నా కూడా ట్విట్టర్ లు, ఫేస్ బుక్ లు, వాట్సప్ లు మోత మోగిపోతాయి. అది కామన్ అయిపోయింది. హిట్ లు వచ్చేస్తాయి..ట్రెండింగ్ లు అయిపోతాయి. సో, సంభవామికి కూడా నిన్న అంతా కాస్త గట్టిగానే ట్వీట్ లు పడ్డాయి. కొందరు అభిమానుల టైటిల్ లోగోలు కూడా డిజైన్ చేసేసారు.
సో, మొత్తం మీద మహేష్ హాఫ్ మైండెడ్ గా ఓకె అన్నా కూడా, సంభవామి టైటిల్ జనంలోకి వెళ్లిపోయినట్లే. దుష్టసంహారం కోసం ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరించినట్లే, ప్రతి సినిమాలోనూ విలన్ సంహారం కోసం హీరో అవతరిస్తుంటాడుగా..సో, టైటిల జస్టిఫికేషన్ జరిగిపోయింది. మహేష్ కూడా మరి కాస్త మొగ్గు చూపితే, ఆయన 23వ సినిమా ‘సంభవామి ‘ అవుతుంది.