బొడ్డు కాదు.. డ్రెస్ చూడండి బాబులూ..!

ఈ మధ్య ఓ మేగజైన్ కు అదిరిపోయే ఫొటోషూట్ చేసింది సమంత. చేనేత వస్త్రాలకు మరింత ప్రచారం కల్పించేందుకు పక్కా పోచంపల్లి చేనేత దుస్తులు ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. బేసిక్ గా హీరోయిన్ కదా, చేనేత కూడా ట్రెండీగా మారిపోయింది. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. వీళ్లు ఒకటి ఊహిస్తే జనాలు ఇంకోటి అనుకున్నారు. చేనేతకు ప్రచారం పక్కనపెడితే, సమంత ఎక్స్ పోజింగ్ పై అందరి దృష్టిపడింది.

ఫొటోలో సమంత నాభి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. దీనికి తోడు పైన టాప్ కూడా పేరుకు మాత్రమే జాకెట్ అనేలా ఉంది. దీంతో అంతా ఆ యాంగిల్ లోనే కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అలా సమంత ఒకటి అనుకుంటే, రిజల్ట్ మరోలా వచ్చింది. చేనేత పక్కకు పోయింది.

అప్పటికీ ఓ ట్వీట్ కు సమాధానంగా.. అందాలు చూడొద్దు ఆత్మవిశ్వాసం చూడండంటూ సమంత క్లాస్ పీకే ప్రయత్నం చేసింది. కానీ ఫొటో మాత్రం ఎక్స్ పోజింగ్ యాంగిల్ లోనే క్లిక్ అయింది. ప్రస్తుతం సమంత, తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Show comments