హాట్‌ హాటర్‌ హాటెస్ట్‌ జాక్వెలైన్‌

'ఎ జెంటిల్‌మెన్‌' సినిమా ట్రైలరొచ్చింది. సిద్దార్ధ మల్హోత్రా, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ జంటగా నటించారు ఈ చిత్రంలో. ఓ బుద్ధిమంతుడు, ఇంకో వైపు హత్యలు చేసేస్తుంటాడు. ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో చాలానే సినిమాలొచ్చాయి.

ఆ లెక్కన, ఇదేమీ కొత్త కాన్సెప్ట్‌ కాకపోవచ్చుగాక.! ట్రైలర్‌ రాగానే 'ఎ జెంటిల్‌మెన్‌' గురించి విన్పించిన కామెంట్‌ ఇదే. అయితే, ఇందులో జాక్వెలైన్‌ హాట్‌ అప్పీల్‌ గురించి మాత్రం చాలానే చర్చ జరుగుతోంది.

వెండితెరపై అందాల విందు చేయడం జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌కి కొత్తేమీ కాదు. అయితే, 'అంతకు మించి' అనే స్థాయిలో జాక్వెలైన్‌ ఈ 'ఎ జెంటిల్‌మెన్‌' సినిమా కోసం చెలరేగిపోయిందట. సిద్దార్ధ, జాక్వెలైన్‌ మధ్య హాట్‌ హాట్‌ సన్నివేశాలకు కొదవే లేదన్నట్టు ల్రైటర్‌లోనే చూపించాల్సినవన్నీ చూపించేశారు.

'ఇట్‌ వాస్‌ జస్ట్‌ ఎ కిస్‌' అంటూ ట్రైలర్‌కి ముందు జాక్వెలైన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఊరించిన విషయం విదితమే. దానికి సంబంధించి ఓ సీన్‌ని ట్రైలర్‌లో వుంచారు. దానికి కొనసాగింపుగా ఇంటిమేట్‌ సీన్‌ 'టాప్‌ లేపేసేలా' కన్పించింది. 

ఇక, యాక్షన్‌ పరంగా ట్రైలర్‌లో చాలా చాలానే చూపించేశారు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్పించబోతున్నాడు.

Show comments