సాయిధరమ్‌ 'హ్యాండిల్‌ విత్‌ కేర్‌'.!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ 'హ్యాండిల్‌ విత్‌ కేర్‌' అంటున్నాడు. ఇది తన తాజా సినిమా 'తిక్క' క్యాప్షన్‌. సునీల్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తిక్క' సినిమా ఫస్ట్‌ లుక్‌ని కాస్సేపటి క్రితమే విడుదల చేశారు. గుర్రమ్మీద వెళుతూ, చేతిలో బీరు బాటిల్‌ పట్టుకుని హీరో వున్న స్టిల్‌ని ఫస్ట్‌ లుక్‌గా ప్లాన్‌ చేయడం కాస్త కొత్తగానే వుంది. 

సినిమా సినిమాకీ రేంజ్‌ పెంచుకుంటూ వెళుతున్న సాయిధరమ్‌ తేజ, 'సుప్రీం' సినిమాతో అనూహ్య విజయాన్నే అందుకుంది. జస్ట్‌ యావరేజ్‌ అనుకున్న సినిమా కాస్తా, అంచనాల్ని మించి వసూలు చేయడం గమనార్హం. అంతకు ముందు 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమాలో బాగానే వున్నాయన్పించుకుని, యావరేజ్‌ టాక్‌తో సరిపెట్టుకున్నాయి. 

మరిప్పుడు, 'తిక్క' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్న సాయిధరమ్‌ తేజ, 'సుప్రీం' సినిమాని మించి విజయాన్ని అందుకుంటాడా.? ప్రతి సినిమాలోనూ మేనమామలు మెగాస్టార్‌నీ పవర్‌స్టార్‌నీ ఇమిటేట్‌ చేసే సాయిధరమ్‌, ఈ సినిమాలో అలాంటి ఫీట్స్‌ ఏమైనా చేశాడా.? అన్నిటికీ మించి, మెగాస్టార్‌ రీమిక్సో.. పవర్‌స్టార్‌ రీమిక్సో చేశాడా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.

Show comments