గౌతమ్ నందా లక్కీ

మొత్తానికి లేట్ అయినా భలే డేట్ దొరికింది గౌతమ్ నందా సినిమాకు. 14న రావాల్సింది. కానీ వాయిదా పడింది. మంచి డేట్ మిస్సయింది అనుకున్నారంతా. 28న ట్రయాంగిల్ ఫైట్ తప్పలేదు హీరో గోపీచంద్ కు, డైరక్టర్ సంపత్ నందికి అనుకున్నారు. కానీ చిత్రంగా బరిలోంచి రెండు సినిమాలు తప్పేసుకున్నాయి.

సందీప్ కిషన్, సాయి ధరమ్ లతో డైరక్టర్ కృష్ణ వంశీ చేస్తున్న నక్షత్రం సినిమా వారం వెనక్కు వెళ్లింది. ధనుష్ హీరోగా నటిస్తున్న విఐపి 2 కూడా అదే డేట్ కు రావాల్సి వుంది. ఆ సినిమా కూడా ఆగస్టులోకి వెళ్లిపోయింది. ఎప్పుడు వస్తుందో డేట్ నే ఫిక్స్ కాలేదు.

దీంతో 28న గోపీచంద్-సంపత్ నందిల గౌతమ్ నందా సోలోగా విడుదలవుతోంది. ఈ సినిమాకు కాస్త బడ్జెట్ ఎక్కువే అయింది. హీరో గోపీచంద్ మార్కెట్ తో పోల్చుకుంటే అది కాస్త ఎక్కువే. అయితే సినిమాను లావిష్ గా తీయడం కోసం ఖర్చు పెట్టేసారు. ట్రయిలర్ లో ఆ ఖర్చు కనిపిస్తోంది. ఇప్పుడు సోలో డేట్ పడింది కాబట్టి, లక్కీనే. రికవరీ సులువు అవుతుంది.

Readmore!
Show comments