సెక్స్ అండ్ రిలేషన్ షిప్స్ సర్వే

114 దేశాలకు చెందిన యువతను పట్టుకుని.. పదివేలా ఐదు వందల మంది అబ్బాయిలు, అమ్మాయిలతో సెక్స్ అండ్ రిలేషన్ షిప్స్ మీద అభిప్రాయాలను సేకరించింది ఒక అధ్యయన సంస్థ. హఫింగ్టన్ పోస్టులో ప్రచురితం అయిన ఈ అధ్యయనం ఆసక్తికరంగా ఉంది. ప్రపంచంలోని నలుమూలల దేశాలకు చెందిన యువత నుంచి వారి సెక్సువల్ ప్రిఫరెన్సెస్ గురించి, అత్యధిక శాంపిల్స్ తో జరపబడిన ఈ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, వీటితో అనుసంధానం అయిన కెమెరాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో.. వీటి ప్రభావం శృంగార జీవితంపై ఏ స్థాయిలో ఉందనే అంశం గురించి ఈ సర్వే ప్రధానంగా సాగింది. ప్రధానంగా టెక్కీల తరం యూత్ పల్స్ ను ప్రతిబింబిస్తున్నఈ సర్వేలోని ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే… 

-34 శాతం మంది యువత తాము తమ భాగస్వామితో సాగించిన శృంగార కాండను కెమెరాల్లో నిక్షిప్తం చేసుకున్నామని తెలిపారు! ఇది సరదా అని, అలవాటని వీరిలో కొందరు చెప్పడం గమనార్హం.

- ఇది ప్రమాదకరమైన అలవాటు అయినప్పటికీ వీళ్లు దీనిపట్ల ఆసక్తితో ఉన్నారట. అయితే యాభై శాతం మంది యూత్ ఈ పాడుపని చేయలేదు, చేయమని స్పష్టం చేశారు.  Readmore!

-ఈ సర్వేలో పాల్గొన్న మూడువందల మంది మాత్రం తమకు డబ్బులిస్తే తమ శృంగార కార్యాన్ని కెమెరాల్లో రికార్డింగ్ చేయడానికి రెడీ అన్నారట! 

-పార్ట్ నర్ కు నగ్న సెల్ఫీలు పంపించే అలవాటు ఉందని 49 శాతం మంది  చెప్పారట. శృంగార భావనలు శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడే ఈ పని చేస్తామని కొంతమంది చెప్పారట! 

-అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ సెక్స్ లైఫ్ ను ఎరోటిక్ గా మార్చేస్తోందని మూడోవంతుమంది చెప్పారట.

-తమకు పోర్న్ చూసే అలవాటు ఉందని 59 శాతం యువత చెప్పిందట. వీరిలో 1,200 మంది వారానికి పది సార్లు పోర్న్ చూస్తామని చెప్పారట.

- 75 శాతం మంది జీవితంలో శృంగారం చాలా ముఖ్యమని, అత్యంత ముఖ్యమని చెప్పారు.

Show comments