ఇలియానా 'రుస్తుం' అదిరింది

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ తాజా చిత్రం 'రుస్తుం' టీజర్‌ విడుదలైంది. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది. నేవీలో 1950లలో ఉన్నతాధికారిగా పనిచేసిన కె.ఎం.నానావతి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ నేవీ ఆఫీసర్‌ రుస్తుం పవ్రిగా నటిస్తున్నాడు. 

రుస్తుం దేశభక్తుడా.? విదేశాలకు అమ్ముడుపోయాడా? హంతకుడా.? అంటూ టీజర్‌తో ఉత్కంఠ రేపుతున్నారు. అక్షయ్‌కుమార్‌, ఇలియానా ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌.. అది కూడా ఆ కాలానికి తగ్గట్టుగా చాలా అందంగా చిత్రీకరించారనే విషయం టీజర్‌లో స్పష్టమవుతోంది. యాక్షన్‌ సినిమాలైనా, కామెడీ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలైనా తనదైన ముద్రతో ఆ సినిమాల రేంజ్‌ పెంచే అక్షయ్‌కుమార్‌, ఈ చిత్రంతో మరోమారు సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటాడని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. 

Click Here For Rustom Trailer

విడుదలైన కాస్సేపటికే సోషల్‌ మీడియాలో 'రుస్తుం' టీజర్‌ హల్‌చల్‌ షురూ చేసింది. టిను సురేష్‌ దేశాయ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. జీ టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగస్ట్‌ 12న సినిమా విడుదల కానుంది.

Show comments