ఐపీఎల్ ఈవెంట్ అంటే అది ఏ రేంజ్ లో జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్స్ లో మ్యాగ్జిమమ్ అన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. అదే రేంజ్ లో ఐపీఎల్ సీజన్-10 ప్రారంభోత్సవం కూడా అదిరిపోతుందని అంతా భావించారు. కానీ హీరోయిన్ ఎమీ జాక్సన్ మాత్రం అంత అవకాశం ఇవ్వలేదు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ లో డాన్స్ చేసిన ఎమీ జాక్సన్ అందరితో ఛీ అనిపించుకుంది. మరికొందరికి నవ్వు తెప్పించింది. ఈమె డాన్స్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చీవాట్లు పెట్టారు. మరో రేంజ్ లో ఫన్నీ కామెంట్లు పోస్ట్ చేశారు.
బాలీవుడ్ మెడ్లేకి డాన్స్ చేసిన ఎమీ జాక్సన్... కోచ్ లేకుండా ఎక్సర్ సైజ్ చేస్తున్నట్టు ఉందని కొందరు విమర్సించారు. ఆమె డాన్స్ చూసి 28 మంది డాన్స్ మాస్టర్లు తమ అకాడమీలు మూసుకొని కాశీకి పోయారని కామెంట్లు చేశారు. ఆమె డాన్స్ చేస్తున్నట్టు లేదని, మార్చ్ ఫాస్ట్ చేస్తున్నట్టు ఉందని మరికొందరు నవ్వుకున్నారు. డాన్స్ షో కోసం కేవలం సగం డబ్బులు మాత్రమే ఇచ్చి ఉంటారని, అందుకే ఇలా సగం సగం స్టెప్పులు మాత్రమే వేసిందని మరికొందరు జోకులు వేశారు.
మొత్తమ్మీద ఎమీ జాక్సన్ డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈమెతో ప్రదర్శన ఇప్పించాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారో తెలీదు కానీ, ఎమీకి మాత్రం డబ్బు దండిగానే ముట్టజెప్పారు. ఎమీ స్థానంలో కనీసం సన్నీలియోన్ ను పెట్టినా షో సూపర్ హిట్ అయ్యేది.