వయసు 44, ఇచ్చిందొక హాట్ పోజు!

మందిరా బేడీ గుర్తుందా? జెంటిల్మన్ గేమ్ క్రికెట్ కు ఆడవాసన తీసుకొచ్చి.. అందంగా మార్చిన టీవీ స్టార్! అంత వరకూ క్రికెట్ విశ్లేషణ అంటే.. అది మాజీ క్రికెటర్లు, స్పోర్ట్స్ జర్నలిస్టులు చేసే పని అన్నట్టుగా ఉండే వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది మందిర. సెట్ మ్యాక్స్ వాళ్లు మందిరను విశ్లేషణకు వదిలి.. ఆట కన్నా ఆ అనాలసిస్ ను ఆకర్షణగా మార్చారు.

మందిర విశ్లేషణకు కూర్చుంటే.. స్లీవ్ లెస్ జాకెట్లు, స్లీప్ లెస్ నైట్లు.. అప్పట్లో మందిర మీడియాలో చర్చనీయాంశంగా నిలిచింది. ఇప్పుడైతే చాలా మంది మహిళామణులు క్రికెట్ విశ్లేషణకు వస్తున్నారు. ఇలాంటి వారందరికీ గైడ్ మందిర.

తర్వాతి కాలంలో మందిర తెరమరుగు అయ్యింది. తాజాగా ఆమె తన సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్ లో కొన్ని హాట్ సెల్ఫీలను పోస్టు చేసింది. ఫ్యామీలీతో టూర్లో ఈ సెల్ఫీలను దిగింది మందిర. వీటిని చూశాకా.. మందిర ఏజెంతో చెక్ చేస్తే, ఆశ్చర్యపరిచే నంబర్ కనిపిస్తుంది నలభై నాలుగు అని!

Show comments