అడ్వాన్స్ అందుకున్న బోయపాటి?

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సరైనోడు సినిమాతో గీతాఆర్ట్స్ సంస్థకు మంచి హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకుడు. చిరు 151వ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుందన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కు బోయపాటి లైన్ చెప్పినట్లు, ఆ మేరకు ఆయన ఓకె చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పుడైతే చిరంజీవి లైన్ ఓకె చేసారో, గీతా ఆర్ట్స్ నుంచి బోయపాటికి అడ్వాన్స్ అందినట్లు, అక్కడి నుంచి స్క్రిప్ట్ పని స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

దీనికన్నా ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను స్టార్ట్ చేయాల్సి వుంది. అది వచ్చే నెల ప్రారంభమవుతుంది. అది స్టార్ట్ అయ్యేలోగా చిరు 151వ సినిమా స్క్రిప్ట్ ఓ కొలిక్కి తేవాలన్నది బోయపాటి ఆలోచనగా వుంది. ఎందుకంటే బెల్లంకొండ సినిమా అయిన వెంటనే చిరంజీవి సినిమా పూర్తి చేస్తే, ఆపై బోయపాటికి నందమూరి బ్యాలయ్య క్యాంప్ నుంచి ఆఫర్ రెడీగా వుంది.

Show comments