పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాకు ముందు రెండు మూడు వారాలు బాక్సాఫీస్ డల్ అయిపోయింది. సరైన సినిమా లేక. అది ఓ ప్లస్ పాయింట్. అలాగే వెనుక కూడా రెండు మూడు వారాలు గ్యాప్ వస్తే ఇక సూపర్. అలాంటి పరిస్థితే కనిపించింది నిన్న మొన్నటిదాకా. శర్వానంద్ రాధ వాయిదా పడడంతో. కానీ ఇప్పుడు అలా ఖాళీగా వదిలేసేంత సీన్ కనిపించడం లేదు.
మార్చి 31న విడుదలకు కొన్ని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాయి. వాటిలో కీలకమైనది వెంకీ గురు. బాక్సింగ్ నేపథ్యంలో తయారైన సినిమా తెలుగు, తమిళ్ వెర్షన్లు మంచి ఆదరణకు నోచుకున్నాయి. దాన్నే తెలుగులోకి తెచ్చారు. బాక్సింగ్ గురుగా వెంకీ గెటప్, టీజర్, ట్రయిలర్ అన్నింటికి బాగానే ఆదరణ వచ్చింది. అందువల్ల ఈ సినిమా కూడా కాస్త పోటీగానే అనుకోవాలి.
ఇక చిన్న సినిమా అయినా కాస్త ఆసక్తికరమైన ట్రయిలర్ తో డిఫెరెంట్ సినిమా అనే ఫీల్ ను తెచ్చుకుంది వెంకటాపురం. ఈ సినిమా కూడా 31న విడుదలవుతోంది. అలాగే హర్రర్ సినిమా జోనర్ ప్రేక్షకుల కోసం డోర సినిమా రెడీ అయిపోతోంది. అది కూడా 31నే. అంటే కాటమరాయుడు ఓన్లీ ఫస్ట్ వీక్ థియేటర్లను పంచుకోవడానికి మూడు సినిమాలు రెడీ అయపోతున్నాయి. పైగా గురు సురేష్ వాళ్ల స్వంత సినిమా. అందువల్ల సురేష్ థియేటర్లన్నీ గురు కోసం ఖాళీ చేయాల్సిందే. మొత్తం మీద కాటమరాయుడుకు కాస్తయినా పోటీ తప్పేట్లులేదు.