హీరోయిన్ కన్నా ఇషాకు ప్రాధాన్యత?

ఒక్కోసారి డైరక్టర్లు ఎందుకో, ఎవరికో కనెక్ట్ అయిపోతారు. అది వారికి తెలియకుండానే ప్రొడక్ట్ మీద పడిపోతుంది. కేశవ సినిమా విషయంలో ఇలాంటి సంగతి ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాలో హీరో నిఖిల్ సరసన పెళ్లి చూపులు అమ్మాయి రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమాలోనే బాలీవుడ్ నటి ఇషా కొప్పీకర్ ఓ ఇన్వెస్టిగేషన్ అధికారిగా నటించింది. ఈమె గతంలో కృష్ణవంశీ చంద్రలేఖలో నటించింది.

కేశవ సినిమాకు సంబంధించినంత వరకు దర్శకుడు సుధీర్ వర్మ ఇషాకు కాస్త ఎక్కువే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ డిజైన్ ను తయారుచేయించి హీరో నిఖిల్ కు చూపించాడట. ఆ డిజైన్ లో ఇషా క్లోజప్ ముందుగా వుండి, వెనక బ్యాక్ డ్రాప్ లో ఎక్కడో హీరో నిఖిల్ వున్నాడట. దీంతో నిఖిల్ ఎస్ ఆర్ నో చెప్పకుండా దాన్ని అలా వుంచేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆ డిజైన్ ను వాడడం మానేసారు.

అలాగే వదిలిన టీజర్ లో కూడా హీరోయిన్ కన్నా ఇషానే ఎక్కువ సార్లు కనిపిస్తుందని, దీనికి కారణం దర్శకుడు సుధీర్ వర్మ ఆ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చినట్లు వుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటివరకు హీరో వరకు మాత్రమే వెళ్లిన ఈ సంగతి తెలిస్తే, హీరోయిన్ రీతూ వర్మ ఏమనుకుంటుందో?

 

Show comments