నక్షత్రంలో అయిటమ్ ఈ అమ్మడే

కృష్ణ వంశీ సినిమా అంటే హీరోయిన్ లకు అందులో నటించే అయిటమ్ అమ్మాయిలకు కూడా మాంచి గ్లామర్ టచ్ వుంటుంది. సినిమా ఎలా వున్నా కూడా ఈ విషయంలో మినహాయింపు వుండదు. ప్రస్తుతం సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ లాంటి కాస్టింగ్ తో నక్షత్రం సినిమా అందిస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో ఓ అయిటమ్ సాంగ్ వుంది. దానికి ఎవర్ని తీసుకుంటారో? అని గత కొద్ది రోజులుగా గ్యాపిప్ లు వినిపించాయి.

కృష్ణవంశీ తీసుకువచ్చిన కాజల్ ఓకె అంటుందా? మరెవరు? అంటూ చాలా పేర్లు వినిపింజచాయి. అయితే అసలే బడ్జెట్ సమస్యలతో వున్న నక్షత్రం ఇప్పుడు కోట్లకు కోట్లు ఇచ్చి ఫామ్ లో వున్న యంగ్ అండ్ టాప్ హీరోయిన్లను ఐటమ్ సాంగ్ కు తీసుకునే పరిస్థితి లేదు. అందుకే ఆఖరికి సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ను ఓకె చేసుకున్నారు. ఇప్పటికే శ్రియ చేతిలో బాలయ్య సినిమా ఒకటి వుంది. పైగా చాలా అయిటమ్ సాంగ్ లు చేసిన అనుభవం వుంది. అందుకే ఆమెను కృష్ణ వంశీ ఓకె చేసారట. సో నక్షత్రంలో శ్రియ తళక్కున మెరవబోతోందన్నమాట.

నక్షత్రం సినిమాకు సంబంధించి ఓ అయిటమ్ సాంగ్, కొద్దిగా టాకీ మాత్రమే మిగిలివుంది. జూన్ లో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.

Show comments