బాబుతో ఆ తరహా ముఖాముఖి చేస్తే..?

ఓ చానెల్ లో ముఖాముఖి అంటూ కార్యక్రమం నడుస్తుంటుంది. సదరు ఏంకర్ కమ్ జర్నిలిస్టు తను ఇంటర్వూ చేసేవారిపై వచ్చిన గ్యాసిప్ లు అన్నింటినీ నిలదీసి ప్రశ్నిస్తుంటారు. మీరు భూ కబ్జాదారుడు కదా? వేల కోట్లు ఆర్జించారట కదా? అని రాజకీయ నాయకులను. మీకు హీరోయిన్ తో సంబంధాలు వున్నాయట కదా? మీది అసలు సినిమాలకు పనికి వచ్చే ఫేసేనా అని హీరోలను నిలదీస్తుంటారు. మంచిదే జర్నలిస్టు అన్నాక ఇలాగే ధైర్యంగా నిలదీసి ప్రశ్నించాలి.

మరి చంద్రబాబును ఎప్పుడు ముఖాముఖి చేస్తారనే ప్రశ్న ఆ చానెల్ ను అభిమానించేవారు సంధిస్తున్న ప్రశ్న. నోటుకు ఓటు కేసులో గొంతు మీదేనా కాదా? రేవంత్ అలా డబ్బులు పట్టుకుని వెళ్లడం తప్పా?  కాదా? అసలు మీరు కోర్టు కేసులను విచారణ కాకుండానే ఎందుకు డిఫెన్స్ లోకి వెళ్లి అడ్డుకుంటారు? మీ తప్పు లేనపుడు దమ్ముంటే మీకు నచ్చిన విచారణ చేసుకోండి అని సవాల్ చేయరు? 

మీ అబ్బాయి అధికారులకు, కలెక్టర్లకు ఫోన్ లు చేసి పనులు పురమాయిస్తారట కదా?  ఇలాంటి చాలా ప్రశ్నలను ముందుగానే కాగితాలపై రాసుకువచ్చి మరీ బాబుకు సంధించి, నిలదీస్తే ఎలా వుంటుంది? పోలా? అదిరిపోలా? టీఆర్పీ రేటు సూపర్ గా వుంటుంది కూడా.  

మరి ఆ చానెల్ ఎందుకు ఆ పని చేయదో? సాదా సీదా ఎమ్మెల్యేలు, చిన్న చిన్న హీరోలే దొరుకుతారేమో? బకరాలుగా? తిమింగలాల జోలికి వెళ్లరేమో ? పెద్ద హీరోలను మీరు పెద్ద కాసినోవా కదా? మీకు బోలెడు మంది హీరోయిన్లతో లింక్ వుంది కదా ? అని ప్రశ్నించే అవకాశం లేదేమో?

Show comments