‘మణి’ ట్రయిలర్ ఓకె..మరి సినిమా?

శ్రీరామ్ ఆదిత్య తన తొలి సినిమా భలే మంచి రోజుతో, ఫరవాలేదు, ఇతగాడి దగ్గర కాస్త విషయం వుంది అని ప్రేక్షకుల చేత అనిపించుకున్నాడు. మళ్ళి ప్రయత్నంగా శమంతకమణి అనే సినిమా టేకప్ చేసాడు. భలే మంచి రోజు మాదిరిగానే ఎంటర్ టైన్ మెంట్ థ్రిల్లర్ జోనర్ ను ఎంచుకున్నాడు.

అయిదు కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారు చుట్టూ తిరిగే కథ ఇది. జూలై 14న విడుదలయ్యే ఈ సినిమా ట్రయిలర్ ను ఈ రోజు విడుదల చేసారు.

భలే మంచి రోజులో మాదిరిగా మళ్లీ శ్రీరామ్ ఆదిత్య అదే స్టయిల్ లో ముందుకు వెళ్లినట్లు కనిపిస్తోంది. డబ్బు అవసరం వున్న నలుగురు హీరోలు (రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుధీర్ కుమార్), వీళ్లందరినీ లింక్ చేసే ఓ స్పెషల్ క్యారెక్టర్ లో రాజేంద్ర ప్రసాద్ ముందు అనుకున్నట్లుగానే కనిపించారు. ట్రయిలర్ కట్ చేయడం అయితే బాగానే వుంది.

పాయింట్ ముందే చెప్పేసారు. మరి ఈ పాయింట్ చుట్టూ కథ ఎలా అల్లుకున్నారో? సీన్లు ఎలా డీల్ చేసారో అన్న దాన్ని బట్టి సినిమా ఇంట్రెస్టింగ్ గా వుంటుందా? లేదా? అన్నది ఆధారపడి వుంటుంది. ట్రయిలర్ అయితే ఆసక్తి కరంగానే వుంది.

Show comments