రోజా స్లిమ్మింగ్ సీక్రెట్

ఒకనాటి హీరోయిన్, నేటి పొలిటిషియన్ రోజా తన గ్లామర్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పటికీ ఇప్పటికీ రోజా విషయంలో కీలక మార్పు శరీరం బాగా లావు కావడమే. కాస్త లావు అయినా కూడా రోజా చలాకీ తనం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. టీవీల్లో ఆమె చలాకీ తనం అందరికీ తెలిసిందే. కానీ లావు మాత్రం ఇన్నాళ్లు ఒకేలా వుంటూ వచ్చింది. కానీ, గడచిన రెండు మూడు ఎపిసోడ్ లుగా జబర్దస్త్ ను చూసిన వారు మాత్రం ఒక్కసారిగా రోజా లో కాస్త మార్పు వచ్చినట్లు కనిపెడుతున్నారు. గతంతో పోలిస్తే రోజా కాస్త సన్నబడ్డట్లు గమనిస్తున్నారు. అయితే ఇలా సన్నబడ్డం వెనుక వున్నది యోగా, వ్యాయామం లాంటి నాచురల్ వ్యవహారాలా? లేక ఆమె కూడా చాలా మంది మాదిరిగా కొన్ని కిలోల ఫ్యాట్ ను శస్త్ర చికిత్స ద్వారా తొలగించుకున్నారా అని అనుమానాలు వినిపిస్తున్నాయి. రోజా లావు తగ్గించుకునే శస్త్ర చికిత్స చేయించుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే, మార్గం ఏదైనా ఒకప్పటి హీరోయిన్ రోజా మరింత గ్లామరస్ గా తయారయ్యారు కాబట్టి, ఇండస్ట్రీ జనాలు మళ్లీ అమ్మ, వదిన పాత్రలను రోజాకు ఆఫర్ చేస్తారేమో?

 

Show comments