టాలీవుడ్‌ పెద్దలూ.. నోళ్ళు మూయించండి

తెలుగు సినిమా పరువు తీసేస్తున్నారు ఇద్దరు నిర్మాతలు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు నట్టికుమార్‌, చిల్లర కళ్యాణ్‌. ఒకర్ని మించి ఇంకొకరు.. మీడియా ముందు రెచ్చిపోతున్నారంతే. ఎంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చిందో లేదోగానీ, నయీం చావు తెలుగు సినిమా ఖర్మకి వచ్చినట్టుంది. అంతే మరి, లేకపోతే.. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ అవడమేంటి, తెలుగు సినీ నిర్మాతలు బండ బూతులు తిట్టుకోవడమేంటి.? సిగ్గు సిగ్గు.! 

చిల్లర కళ్యాణ్‌ అలియాస్‌ సి.కళ్యాణ్‌ని పట్టుకుని నట్టికుమార్‌ నానా తిట్లూ తిట్టేశాడు. సి.కళ్యాణ్‌కి నయీంతో సంబంధాలున్నాయట. అంతే కాదు, దొంగ అనీ, ఇంకోటనీ నట్టికుమార్‌ నోరు పారేసుకున్నాడు. సి.కళ్యాణ్‌ ఊరుకుంటాడా.? ఆయనా తన నోటికి పని చెప్పాడు. 'బ్లూ ఫిలింల బతుకు నీది..' అంటూ నట్టికుమార్‌ని చెడా మడా తిట్టేశాడు. దానికి మళ్ళీ నట్టికుమార్‌ కౌంటర్‌, 'బ్లూ ఫిలిం కేసులో జైలుకు వెళ్ళి వచ్చావ్‌ మచ్చిపోయావా.?' అని. 

తెలుగు సినీ పెద్దలూ ఇకనైనా స్పందించండి, వీళ్ళ నోళ్ళు మూయించండని సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు వాపోతున్నాడు. అంతలా, సిగ్గు విడిచి రచ్చకెక్కారు ఈ ఇద్దరు నిర్మాతలు. నాన్సెన్స్‌, వీళ్ళని నిర్మాతలని ఎందుకు అనాలి.? తెలుగు సినిమా గౌరవాన్ని దిగజార్చేస్తున్నారు వీళ్ళిద్దరూ. నట్టికుమార్‌ సంగతేంటో, ఎలాంటి సినిమాలతో ఆయన నిర్మాత అయ్యాడో అందరికీ తెలుసు. సి.కళ్యాణ్‌ సంగతి సరే సరి. ఇద్దరూ ఇద్దరే. ఇలాంటోళ్ళు నిర్మాతలైతే, తెలుగు సినీ ప్రముఖులుగా చెలామణీ అవుతోంటే, తెలుగు సినీ కళామతల్లి సిగ్గుతో బిక్కచచ్చిపోకుండా వుంటుందా.?

కొసమెరుపు: ఆఫీస్ బాయ్ అయిన సి.కళ్యాణ్ ఇప్పుడెలా నిర్మాత అయ్యారని ప్రశ్నిస్తున్నారు నట్టికుమార్. నట్టికుమార్ బతుకేంటో తనకు తెలుసని సి.కళ్యాణ్ అంటున్నారు. ఇదండీ, ఈ ఇద్దరు నిర్మాతల బాగోతం. Readmore!

Show comments

Related Stories :