సింగర్‌గా సుమ పెద్ద షాకే ఇచ్చింది

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ సుమ, సింగర్‌గా మారి 'విన్నర్‌' సినిమాలో ఓ పాట పాడేసింది. ఆ పాట కూడా ఐటమ్‌ సాంగ్‌ కావడమే ఇక్కడ అతి పెద్ద విశేషం. మామూలుగా బుల్లితెరపై పలు గేమ్‌ షోస్‌లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ సరదా సరదాగా సుమ పాటలు పాడేస్తుంటుంది. పనిలో పనిగా తన పాటల మీద తానే సెటైర్లు కూడా వేసేసుకుంటుందనుకోండి.. అది వేరే విషయం. 

అన్నట్టు, 'విన్నర్‌' సినిమాలో సుమ పాడిన ఐటమ్‌ సాంగ్‌ క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ సాంగ్‌ని ట్విట్టర్‌లో విడుదల చేశాడు. తమన్‌ సంగీతం అందించాడు 'విన్నర్‌' చిత్రానికి. ఈ పాటలో మరో బుల్లితెర బ్యూటీ అనసూయ నటించినా, ఆమె కన్నా ఎక్కువగా ఇప్పుడంతా సుమ సింగింగ్‌ టాలెంట్‌ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దాంతో, అనసూయ ఫ్యాక్టర్‌ ప్రస్తుతానికి డల్‌ అయిపోయిందనే చెప్పాలి. 

ఇక, 'విన్నర్‌'లో 'సూయా.. సూయా..' సాంగ్‌లో అనసూయ ఎలా వుంటుంది.? అన్న విషయానికొస్తే, ఆమె గ్లామర్‌ కాస్త గట్టిగానే పండించిందనే విషయం చూచాయిగా అర్థమవుతోంది. మేకింగ్‌ తరహాలో కొన్ని విజువల్స్‌ని ఆడియో సింగిల్‌లో పొందుపర్చారు. సాయిధరమ్‌ తేజ హీరోగా నటించిన 'విన్నర్‌' చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకుడు కాగా, ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Readmore!
Show comments

Related Stories :