సుడిగాడు సల్మాన్ ఖాన్

జోధ్‌పూర్‌ న్యాయస్థానం బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ని నిర్దోషిగా తేల్చింది. 1998 నాటి కేసు ఇది. కృష్ణ జింకల్ని వేటాడాడు సల్మాన్‌ఖాన్‌ అప్పట్లో. ఆ సమయంలో అతనితోపాటు 'హమ్‌ సాత్‌ సాత్‌ హై' సినిమా కో-స్టార్స్‌ సైఫ్‌ అలీఖాన్‌, టబు, సోనాలి బింద్రే, నీలమ్‌ తదితరులున్నారు. వీరందరికీ వేటమాంసంతో విందునిచ్చాడు సల్మాన్ ఖాన్. అయితే, ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌కి 'బిగ్‌' రిలీఫ్‌ వచ్చింది మాత్రం, జింకల్ని వేటాడిన కేసులో కాదు.. అక్రమంగా ఆయుధాల్ని వినియోగించిన కేసులో. 

మొత్తం నాలుగు కేసులు అప్పట్లో సల్మాన్‌ఖాన్‌ మీద నమోదయ్యాయి. వీటిల్లో ముఖ్యమైనది కృష్ణ జింకల్ని వేటాడిన కేసు. ఆల్రెడీ ఓ సారి న్యాయస్థానం నుంచి సల్మాన్‌ఖాన్‌కి ఈ 'వేట' కేసులో ఊరట లభించినా, కేసు మళ్ళీ తిరగబడింది. ఇక, లైసెన్స్‌ లేకుండా ఆయుధాల్ని వినియోగించిన కేసులో ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌కి క్లీన్‌ చిట్‌ లభించింది. దాంతో, అతని సన్నిహితులు ఇది 'చాలా పెద్ద రిలీఫ్‌' అని చెబుతున్నారు. 

బాలీవుడ్‌ 'సుల్తాన్‌' సల్మాన్‌ఖాన్‌ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. గతంలో తప్పతాగి మద్యం సేవించి, నిర్లక్ష్యంగా కారు నడిపి, ఒకరి మృతికి కారణమైన కేసులో చిత్రంగా తప్పించుకున్నాడాయన. సరైన సాక్ష్యాధారాల్ని చూపకపోవడంతో ఆ కేసులో సల్మాన్‌ఖాన్‌ నిర్దోషిగా బయటపడ్డాడు. ఇప్పుడు, ఆయుధాల కేసులో రిలీఫ్‌ పొందడం విశేషమే మరి. కృష్ణ జింకల కేసు వ్యవహారం మాత్రం ఇంకా సస్పెన్స్‌లో పడింది. 

ఆసక్తికరమైన విషయమేంటంటే, 'సరైన ఆధారాలు లేని కారణంగా' సల్మాన్‌ఖాన్‌ పదే పదే తప్పించుకోవడం. Readmore!

Show comments