పెద్ద సినిమాల హడావుడి అయిపోవడంతో ఇక ఎప్పుడో పూర్తయిపోయి విడుదలకు రెడీగా వున్న సినిమాలు చకచకా రుమాళ్లేస్తున్నాయి. సింగం3, నేను లోకల్, ఓం నమో వేంకటేశాయ, ఘాజీ, విన్నర్, సినిమాలు ఇప్పటికే తలో వారం వంతున డేట్ లు ప్రకటించేసాయి.
ఇవి కాక ఇంకా లక్కున్నోడు, ద్వారక, గుంటూరోడు వుండనే వున్నాయి. ఆచి తూచి రావాలనుకుంటున్న గురు, లక్ష్మీ బాంబ్, సినిమాలు కూడా వున్నాయి. మార్చి నెల సినిమాలకు అంత అనుకూలం కాదు. అందుకే మాగ్జిమమ్ ఫిబ్రవరిలో సర్దుబాటు అయిపోవాలని చూస్తున్నారు.
మార్చిదాటితో ఏప్రియల్, మే, జూన్ నెలలు మళ్లీ పెద్ద సినిమాలు వచ్చి పడతాయి. కాటమరాయుడు, డిజె, బాహుబలి 2, సంభవామి, మిస్టర్, భాగమతి, సినిమాలు వుండనే వున్నాయి. అందుకే ఫిబ్రవరి ఫుల్ బిజీగా వుండేలా కనిపిస్తోంది.