పెటా ఉద్యమ కారిణిగా జల్లికట్టు విషయంలో నిరసన భావాన్ని ప్రదర్శించిన త్రిష ఆ తర్వాత తమిళుల ధాటిని తట్టుకోలేక తాత్కాలికంగా తన ట్విటర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని పోస్టు చేసి ఆమె సైడయ్యింది. ట్విటర్ లో ఈమెకు దాదాపు ముప్పై రెండు లక్షల మంది పాలోయర్లు ఉన్నారు.
తన ట్విటర్ అకౌంట్ హ్యాంకింగ్ కు గురి అయ్యిందని త్రిష మొదట ప్రకటించింది. ఈ విషయమై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే డీ యాక్టివేట్ అంశాన్ని ప్రకటించింది. జల్లికట్టును వ్యతిరేకించిన త్రిషపై తమిళులు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తను కూడా తమిళురాలినే అని ఆమె ప్రకటించిప్పటికీ వారు తగ్గలేదు. జల్లికట్టు సమర్థకుడు అయిన కమల్ హాసన్ స్పందించి, త్రిష ను వదిలేయాలని ఆమెపై విరుచుకుపడుతున్న వారికి సూచించారు. త్రిష అభిప్రాయం పట్ల ఒకింత వ్యంగ్యంగా స్పందిస్తూనే ఆమెను వదిలేయాలని కమల్ ట్వీట్ చేశాడు.
ఏదేమైనా త్రిషకు భావస్వేచ్ఛ ఉంది. ఆమె తన అభిప్రాయాన్ని చెప్పింది. చట్టబద్ధంగానే మాట్లాడింది. అలాంటి అమ్మాయిపై ఈ విధమైన దాడి మాత్రం సమర్థనీయం కాదు. త్రిష ఇప్పటికీ తన అభిప్రాయాలకు కట్టుబడి ఉండటం అభినందనీయం.