వామ్మో.. ప్రియాంక, అది నువ్వేనా?!

శృంగారాన్ని పండించడంలో అమెరికన్ భామలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు.. హాలీవుడ్ హీరోయిన్లు ఈర్ష పడేంత స్థాయిలో రెచ్చిపోతోంది ప్రియాంక చోప్రా. అమెరికన్ టీవీ సీరిస్ క్వాంటికో తొలి సీజన్ లో రెచ్చిపోయి శృంగార సన్నివేశాలు చేసిన ప్రియాంక.. ఈ టీవీ సీరిస్ రెండో సీజన్ లో అంతకు మించిన స్థాయిలో రెచ్చిపోయింది. తనకు తానే పోటీ అన్నట్టుగా శృంగార సన్నివేశాల్లో జీవించేసింది ఈ ఇండియన్ హీరోయిన్.

క్వాంటికో సీరిస్ -2 కి సంబంధించి విడుదల అయిన టీజర్ లో ప్రియాంక ప్రదర్శన చూసి.. ఔరా అనుకుంటున్నారు భారతీయులు. బెడ్ మీద మేల్ ఆర్టిస్టుకు మించిన స్థాయిలో రెచ్చిపోయింది ప్రియాంక. ఇది వరకూ అనేక బాలీవుడ్ సినిమాల్లో ఈమె శృంగార సన్నివేశాల్లో నటించినా.. ఈ స్థాయి ప్రదర్శన ఎందులోనూ లేదు.

పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా.. అక్కడ లభించే పారితోషకాలకు తగ్గట్టుగా ప్రియాంక రెచ్చిపోయినట్టుగా ఉంది. ఒకవైపు హాలీవుడ్ హీరోయిన్ గా చేస్తూ, మరిన్ని అవకాశాల కోసం వేచి చూస్తుండటం కూడా ప్రియాంక మరీ ఇలా రెచ్చిపోవడానికి ఒక కారణం అనుకోవాల్సి వస్తోంది. క్వాంటికో-2 ట్రైలర్ పార్ట్ తోనే ఇంతలా వేడెక్కిస్తున్న ప్రియాంక.. అసలు పార్టుతో ఇంకెంత సంచలనం  సృష్టిస్తుందో మరి!

Show comments