మహేష్ పుట్టినరోజున డబుల్ బొనాంజా

ఒకటి కాదు, ఈసారి 2 సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడు మహేష్ బాబు. పుట్టినరోజు కానుకగా స్పైడర్ కు సంబంధించి కచ్చితంగా టీజర్ లేదా ట్రయిలర్ ను రిలీజ్ చేస్తారు. దీంతోపాటు కొరటాల సినిమాకు సంబంధించి కూడా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్.

స్పైడర్ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. "గ్లింప్స్ ఆఫ్ స్పైడర్" పేరిట ఇప్పటికే ఓ టీజర్ రిలీజ్ చేశారు. మహేష్ పుట్టినరోజు నాడు మరింత స్టఫ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ నెలలోనే స్పైడర్ రెండో టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మిస్ అయితే అది మహేష్ పుట్టినరోజు నాడు వస్తుంది.

ఇక పుట్టినరోజు సందర్భంగా "భరత్ అనే నేను" సినిమా ఫస్ట్ లుక్ కూడా ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ రెండు సినిమాలు మహేష్ పుట్టినరోజు నాడు సందడి చేయనున్నాయి.

Show comments