పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. డిసెంబర్ 16న వరల్డ్‌వైడ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందని, విడుదలైన అన్ని సెంటర్స్‌లో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోందని చిత్ర నిర్మాత కేకె రాధామోహన్ ఓ ప్రకటనలో తెలిపారు.
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''మా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలోని కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా బి, సి సెంటర్స్‌లో కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్‌గా వున్నాయి. మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
డైరెక్టర్ ఇ.సత్తిబాబు మాట్లాడుతూ - ''కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీ క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. మా చిత్రానికి ఇంతటి ఘనవిజయాన్ని చేకూర్చిన ఆడియన్స్‌కి ధన్యవాదాలు'' అన్నారు.
హీరో పృథ్వీ మాట్లాడుతూ - ''మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రంలో మరో సినిమా వుంటుంది. ఆ సినిమాలో నేను హీరో క్యారెక్టర్ చేశాను. ఆడియన్స్ నుంచి ఆ క్యారెక్టర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ఫోన్లు చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ బేనర్‌లో వచ్చిన బెంగాల్ టైగర్‌లో నేను చేసిన క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చింది. మళ్ళీ ఈ చిత్రంలో చేసిన క్యారెక్టర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత రాధామోహన్‌గారికి, దర్శకుడు సత్తిబాబుగారికి, ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అన్నారు.
పృథ్వీ, నవీన్‌చంద్ర, సలోని, శృతి సోధి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖా రామన్, మీనా, నేహాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్, డైలాగ్స్ డెవలప్‌మెంట్: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: కిరణ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.