అతని కోసం ఆమెతో తాప్సీ 'ఫైటింగ్‌'

వరుణ్‌ ధావన్‌ సరసన 'జుద్వా-2' సినిమాలో సొట్ట బుగ్గల సుందరి తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. అయితే, ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటిస్తోన్న శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో తాప్సీకి అస్సలేమాత్రం పొసగడంలేదట.

కారణమేంటని ఆరా తీస్తే, ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య వివాదానికి కారణం 'జుద్వా-2' నిర్మాత సాజిద్‌ నడియడ్‌వాలా అని తేలింది. ఏ సినిమా చేసినా ఆ సినిమాలోని హీరోతోనూ, దర్శక నిర్మాతలతోనూ కాస్తంత 'క్లోజ్‌'గా వుండడం జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌కి వెన్నతో పెట్టిన విద్య.

ఈ విషయంలో తాప్సీ తక్కువేమీ తినలేదుగానీ, తాప్సీతో పోల్చితే జాక్వెలైన్‌ స్పీడ్‌ ఇంకాస్త ఎక్కువే. అక్కడే వ్యవహారం తేడా కొట్టేసింది. ఇంకేముంది, నిర్మాత కోసం తాప్సీ - జాక్వెలైన్‌ మీద గుస్సా అవుతోంది.

ఇప్పుడిదే బాలీవుడ్‌లో హాటెస్ట్‌ గాసిప్‌ అయి కూర్చుంది. అయితే, తాప్సీ మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. సాజిద్‌ నడియడ్‌వాలా ఓ నిర్మాత, తాను ఓ హీరోయిన్‌ మాత్రమేననీ, ఇద్దరి మధ్యా సినిమా సంబంధం తప్ప, ఇంకే రిలేషన్‌ లేదనీ తన మీద వస్తున్న గాసిప్స్‌ని ఖండించేసింది.

Readmore!

ఎంత ఖండించేసినా జాక్వెలైన్‌, తాప్సీ ఒకరి మీద ఒకరు మండిపడ్తు న్న వైనం గురించి బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కోవడం మాత్రం తగ్గడంలేదు.

Show comments