వామ్మో.. మళ్లీ వర్క్ షాప్ పెట్టాడు

కబాలి సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు ఆ సినిమా దర్శకుడు పా రంజిత్ ఏం చేశాడో అందరికీ గుర్తుండే ఉంటుంది. నటీనటులందరితో రిహార్సల్స్ ఏర్పాటుచేశాడు. ఈ రిహార్సల్స్ కార్యక్రమానికి రజనీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ తతంగం చూసి సినిమా కథ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుందని, రజనీ క్యారెక్టర్ మరింత టఫ్ గా ఉంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కట్ చేస్తే, కబాలి చూసి "ఓస్ ఇంతేనా" అన్నారు తెలుగు ఆడియన్స్.

ఇప్పుడు అదే దర్శకుడు మళ్లీ రిహార్సల్స్ ప్రారంభించాడు. త్వరలోనే రజనీకాంత్ తో మరో సినిమా చేయబోతున్నాడు పా రంజిత్. ఈ మూవీకి సంబంధించి కొంతమంది నటీనటులతో వర్క్ షాప్ ప్రారంభించాడు. ఈ వర్క్ షాప్ కు రజనీకాంత్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

కబాలి స్టయిల్ లోనే కొత్త సినిమాలో కూడా రజనీకాంత్ డాన్ లా కనిపించబోతున్నారు. అందుకే అభిమానులంతా ఈ కొత్త సినిమాను కబాలి-2 అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించనున్న ఈ సినిమా.. మే 1న లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. అదే రోజు టైటిల్ ప్రకటిస్తారట. ముంబాయి, చెన్నైలో మ్యాగ్జిమమ్ షూటింగ్ పూర్తిచేయాలని నిర్ణయించారు.

Readmore!
Show comments