కుర్రాడికి అనుష్క కావాలంట

నాగశౌర్యకు చిన్న చిన్న ఆశలు లేవు..కుర్రాడికి అనుష్క అంటే ఇష్టం అంట..అందుకని ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లో, ఇంకోటో గ్యాసిప్ లు రాస్తే బాగుండును అంటున్నారు. ఇటీవల అతగాడు హీరోయిన్ నీహారికతో డేటింగ్ చేస్తున్నట్లు గ్యాసిప్ లు గుప్పమన్న సంగతి తెలిసిందే. అయితే దాన్నే మీడియా జనాలు అతగాడిని అడిగేసారు. 

దానికి సమాధానం చెబుతూ, ప్రతి సినిమా అప్పుడు ఒక్కో హీరోయిన్ తో ముడేయడం కామన్ అయిపోయిందన్నాడు. రెజీనా, రాశీ, ఇలా చాలా మందితో ముడేసారని, అందువల్ల తను పెద్దగా పట్టించుకోవడం మానేసానని అన్నాడు. కానీ అంతటితో ఊరుకున్నాడా.. తనకు అనుష్క అంటే ఇష్టమని, ఆమెతో ముడేస్తూ రాస్తే బాగుండును అని కూడా అనేసాడు.

మొత్తానికి ఆ విధంగా మనసులో మాట చెప్పేసాడు. బాగానే వుంది. కానీ అనుష్క వయసెక్కడ..ఈ పిలగాడి వయసెక్కడ..మధ్యలో చాలా గ్యాప్ వుందిగా.. ఏమిటో చిన్నవాడి పెద్ద కోరికలు.

Show comments