ఇల్లీ బేబ్ లవ్ అండ్ కెరీర్ ప్రోబ్లమ్స్

'ఓ హీరోకి పెళ్ళంటే పండగ చేసుకుంటారు.. ఆ హీరోకి శుభాకాంక్షలు చెబుతారు.. కెరీర్‌లో కొత్త జోష్‌ రావాలని కోరుకుంటారు.. అదే ఓ హీరోయిన్‌ పెళ్ళి చేసుకోవాలనుకుంటే, ఇక ఆమె కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పడిపోయినట్లే.. వున్న అవకాశాలూ పోతాయి.. హీరోకీ, హీరోయిన్‌కీ ఈ తేడా ఎందుకో నాకర్థం కావడంలేదు..' 

- ఇదీ ఇలియానా ఆవేదన. 

బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూతో చాలాకాలంగా ఇలియానా డేటింగ్‌లో వుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ, ఇలియానా కెరీర్‌కి ఏమన్నా ఇబ్బంది వచ్చిందా.? రాలేదు. కానీ, ఎందుకో ఇలియానా అభద్రతాభావనికి గురవుతోంది. ఆమె ప్రశ్నలో కొంత న్యాయం వుందిగానీ, అది ఆమెకు వర్తించలేదు కదా.! ఏంటో ఇలియానా, బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ గురించి మాట్లాడాల్సి వస్తే లాజిక్‌ మర్చిపోయి, ఎమోషనల్‌ అయిపోతుంటుంది. 

ఇలియానాకి కెరీర్‌లో అవకాశాలు తగ్గిపోవడానికి కారణం బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూయేనట. 'బహుశా ఆండ్రూ, నేను కలిసి వుండడం కొందరికి ఇష్టం లేదేమో..' అంటూ అసహనం వ్యక్తం చేసింది ఇలియానా. హీరోలకి పెళ్ళయినా, వారి కెరీర్‌ విషయంలో భార్య పెత్తనం చాలా తక్కువ.

అదే హీరోయిన్ల విషయంలో అలా కాదు, భర్తల పెత్తనం ఎక్కువైపోతుంటుంది. అందుకే, హీరోయిన్లకు పెళ్ళయితే అవకాశాలు తగ్గిపోతాయి.. పెళ్ళి ప్రస్తావన వస్తేనే హీరోయిన్ల కెరీర్‌ అటకెక్కిపోతుంది. అద్గదీ అసలు విషయం.

అఫ్‌కోర్స్‌, కరీనాకపూర్‌ పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో అదే స్టార్‌డమ్‌ని కొనసాగించిందనుకోండి.. ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా.?

Show comments