అభిమానం చాటుకున్న జగన్

జనం అభిమానించే నేతకు కూడా ఓ అభిమాన నాయకుడు లేదా అభిమాన హీరో వుంటాడు. వైకాపా అధ్యక్షడు వైఎస్ జగన్ కూడా ఇందుకు అతీతం కాదు. ఆయన అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ. ఇది బహిరంగ రహస్యం. జగన్ యంగ్ ఏజ్ లో బాలయ్య అభిమాన సంఘానికి నాయకుడిగా వున్నాడు కూడా. అంత వీరాభిమానం జగన్ కు నందమూరి బాలయ్య అంటే. 

ఇప్పుడు అదే అభిమానం మరోసారి ప్రదర్శించారు జగన్. తెలుగుదేశం ఎమ్మెల్యేల్లోనే ఉత్తమ ఎమ్మెల్యే బాలయ్యే అంటూ జగన్ కితాబిచ్చారట. అసెంబ్లీ బయట జగన్ పిచ్చాపాటీగా మాట్లాడుతూ, ఒకరిని విమర్శించారు. లేనివి మాట్లాడరు. మంచి మాటలే మాట్లాడే ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారట. అంతే కాదు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరిలోకీ బాలయ్యే బెస్ట్ అన్నారట. 

తెలుగుదేశం పార్టీ సర్వేల్లో, జనాభిప్రాయ సేకరణలో ఏ ర్యాంక్ వస్తేనేం, ఎన్ని మార్కులు వస్తేనేం, ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇచ్చిన సర్టిఫికెట్ ముందు అవన్నీ వృధానే కదా. బాలయ్య ఈ విషయం విని ఎంత పొంగిపోయి వుంటారో?

Readmore!
Show comments

Related Stories :