రాజమౌళి ఫాదర్ టీవీ సీరియల్?

రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ ఖాళీగా వుండడం తక్కువ. ఏదో ఒకటి ఆలోచిస్తూనే వుంటారు. సినిమాలకు కథలు అన్నది ప్రయిమరీ విషయం. అలాగే రెండు సినిమాలు ఆయన ప్లానింగ్ లో వున్నాయి. ఒకటి ఆల్ రెడీ పూర్తయింది. మరో లైన్ ను ఓ హీరోకి చెప్పారు.ఓకె అన్నారు. రెడీ చేస్తున్నారు. వీటన్నింటికి దూరంగా ఓ హిందీ సీరియల్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. 

ఇటీవల టీవీ సీరియల్ లు కూడా భారీగా తయారవుతున్నాయి. పైగా హిందీ సీరియల్స్ ఇటీవల దక్షిణాది భాషల్లో కూడా డబ్ అయి విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. అవి కూడా దాదాపు వెయ్యి ఎపిసోడ్ లకు పైగా రన్ అవుతున్నాయి. అందుకే విజయేంద్ర ప్రసాద్ ఓ వైవిధ్యన ఫ్యామిలీ కమర్షియల్ సీరియల్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది తెలుగు-హిందీ భాషల్లో తయారవుతుందని వినికిడి. ఇది ఇంకా ప్రాజెక్ట్ రిపోర్టు దశలో వుందని తెలుస్తోంది.

Show comments