సంక్రాంతికి ఎప్పటిలానే సినిమా థియేటర్లన్నీ కళకళలాడిపోయాయి. చిరంజీవి, బాలకృష్ణ తలపడుతున్నారనేసరికి మొదట్నుంచీ ఈ సంక్రాంతి పోటీ ఆకర్షించింది. ఇదే బరిలోకి దిల్ రాజు తన ఫ్యామిలీ డ్రామాని కూడా దించడంతో పోటీ ముక్కోణంగా మారింది. ఈ మూడిట్లో ఏది సంక్రాంతి విజేతగా నిలుస్తుందో, ఏది మట్టి కరుస్తుందో అంటూ సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూసాయి. కానీ మూడు సినిమాలపై ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు. ఒకటి చూసి, మరొకటి చూడకపోవడం అన్నది లేకుండా అన్నిటికీ వాటి వాటి బిజినెస్ రేంజ్‌కి అనుగుణంగా పట్టాభిషేకం చేసారు. సంక్రాంతికి విడుదలైన 'ఖైదీ నంబర్ 150', 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'శతమానం భవతి' గురువారం వరకు 140 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి ఈ సంక్రాంతిని బ్లాక్‌బస్టర్ చేసాయి.
బాక్సాఫీస్ బాస్!
రీఎంట్రీలో చిరంజీవిని ఆదరిస్తారా? అనే అనుమానాలకి తెర దించుతూ 'ఖైదీ నంబర్ 150' తొలి రోజునుంచీ కలక్షన్ల ప్రభంజనం సృష్టించింది. వారం తిరిగేసరికి చిరంజీవిని సరాసరి టాప్‌లో నిలబెట్టింది. పదేళ్ల పాటు ఫీల్డుకి దూరమైనప్పటికీ బాక్సాఫీస్ పరంగా తానే కింగ్ అని చిరంజీవి ఈ చిత్రంతో నిరూపించారు. వారం రోజుల్లో 76 కోట్లకి పైగా షేర్ సాధించిన ఈ చిత్రం ఈ వారాంతంలోగా 'బాహుబలి' మినహా అన్ని రికార్డులనీ తుడిచిపెట్టేయనుంది.
ఖైదీ 150 7 రోజుల షేర్లు:
నైజాం: 14.25 కోట్లు
సీడెడ్: 10.80 కోట్లు
వైజాగ్: 8.15 కోట్లు
ఈస్ట్: 6.29 కోట్లు
వెస్ట్: 4.85 కోట్లు
కృష్ణ: 4.13 కోట్లు
గుంటూరు: 5.51 కోట్లు
నెల్లూరు: 2.42 కోట్లు
కర్నాటక: 7.25 కోట్లు
ఓవర్సీస్: 11.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1.25 కోట్లు
టోటల్: 76.4 కోట్లు
శాతకర్ణి పరాక్రమం!
చారిత్రక చిత్రంపై ఉండే ఆసక్తికి తోడు, బాలకృష్ణ వందవ చిత్రమనే క్రేజ్ 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. డీసెంట్ టాక్ తెచ్చుకోవడంతో సంక్రాంతి పండుగని ఈ చిత్రం పూర్తిగా క్యాష్ చేసుకుంది. తొలి వారంలో నలభై రెండు కోట్లకి పైగా షేర్ తెచ్చుకోవడమే కాకుండా బాలకృష్ణ చిత్రాల్లో అతి పెద్ద విజయంగా నిలిచింది. బాలకృష్ణకి తొలి యాభై కోట్ల చిత్రంగా ఇది రికార్డులకెక్కనుంది.
శాతకర్ణి మొదటి వారం షేర్లు:
నైజాం: 7.3 కోట్లు
సీడెడ్: 6.4 కోట్లు
వైజాగ్: 3.95 కోట్లు
ఈస్ట్: 2.98 కోట్లు
వెస్ట్: 3.06 కోట్లు
కృష్ణ: 2.57 కోట్లు
గుంటూరు: 3.65 కోట్లు
నెల్లూరు: 1.58 కోట్లు
కర్నాటక: 3.5 కోట్లు
ఓవర్సీస్: 6.6 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1 కోటి
టోటల్: 42.59 కోట్లు
ఫ్యామిలీ సినిమా బలం!
సంక్రాంతికి ఫ్యామిలీ డ్రామాలని విడుదల చేస్తే ఖచ్చితంగా విజయవంతమవుతాయని చాలా చిత్రాలు నిరూపించాయి. అదే నమ్మకంతో రెండు పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పటికీ 'శతమానం భవతి' చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దించాడు దిల్ రాజు. అతని నమ్మకం వమ్ము చేయకుండా ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పదహారు కోట్లకి పైగా షేర్ సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో పాతిక కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి.
శతమానం భవతి 6 రోజుల షేర్లు:
నైజాం: 4.45 కోట్లు
సీడెడ్: 1.60 కోట్లు
వైజాగ్: 2.49 కోట్లు
ఈస్ట్: 1.63 కోట్లు
వెస్ట్: 1.14 కోట్లు
కృష్ణ: 83 లక్షలు
గుంటూరు: 1.09 కోట్లు
నెల్లూరు: 32 లక్షలు
ఓవర్సీస్+మిగతావి: 2.5 కోట్లు
టోటల్: 16.05 కోట్లు