మహేష్ సినిమాకు టైటిల్ కావలెను

సూపర్ స్టార్ మహేష్ బాబు-ఏస్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో నిర్మాణమవుతున్న సినిమా ముఫై శాతానికి పైగా పూర్తయింది. 120 రోజుల వర్కింగ్ డేస్ లో ఇప్పటికి ముఫై అయిదు వరకు పూర్తయ్యాయి. కూల్ గా అనుకున్న ప్రకారం షూట్ జరుగుతోంది. ప్రస్తుతం ఆర్ ఎప్ సి సమీపంలోని ప్రయివేట్ రోడ్లలో పిక్చరైజ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయాల్సిన టైమ్ వచ్చింది. ఎందుకంటే దీపావళి వస్తోంది. తమిళులకు కూడా ఆసక్తికరమైన పండుగ. అందువల్ల టీజర్ వదిలేందుకు అనువైన సమయం. కానీ టైటిల్ లేకుంటే ఎలా? 

ఇప్పుడు మురుగదాస్ అండ్ కో ఆ పనీ మీదే ఆలోచనలు ప్రారంభించారు. అయితే తెలుగు-తమిళ భాషలకు ఉమ్మడి టైటిల్ వుండాలన్నది దర్శకుడు మురుగదాస్ ఆలోచన. కానీ అక్కడే సమస్య. తమిళం వాళ్లకి వీలయినంత వరకు ఇంగ్లీష్ వాడకూడదు. కామన్ టైటిల్ అంటే మరి ఎలా? అందుకే రెండు భాషల్లో కామన్ గా వుండే పదాల కోసం చూస్తున్నారు.

వీలయితే టైటిల్ హీరో పేరు మీదే వుంటే ఎలా వుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. అలా అయితే టైటిల్ ప్రకారం హీరో పేరు కూడా మార్చుకునే వెసులుబాటు ఎలాగూ వుంటుంది. కానీ రెండు భాషల్లో కామన్ గా వుండే పేర్లు అంటే ఇరు భాషలకు మాతృక అయిన సంస్కృతం నుంచి తేవాలేమో?

Show comments