పిక్‌ టాక్‌: హాట్‌ 'యోగం.!

'లోఫర్‌' ఫేం దిశా పటానీ బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాల్లో నటించింది. ఏకంగా జాకీచాన్‌తో హాలీవుడ్‌ సినిమా 'కుంగ్‌ ఫూ' యోగాలో కూడా నటించేస్తోంది దిశా పటానీ. ఇకనేం, ఈ సినిమాకి సంబంధించిన ఫొటోలతో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసేస్తోంది. జాకీచాన్‌తో కలిసి ఫొటోలకు పోజులిస్తూ, అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతోంది దిశా పటానీ. 

పేరుకే హాలీవుడ్‌ (చైనీస్‌ మూవీ అనుకోవచ్చు) మూవీ అయినా, బాలీవుడ్‌ తారాగణం కూడా ఇందులో నటిస్తోంది. మన భారతీయ సంప్రదాయ యోగాకి, చైనీస్‌ పోరాట విద్య అయిన కుంగ్‌ ఫూని మిక్స్‌ చేసి, ఈ 'కుంగ్‌ ఫూ యోగా' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గతంలో జాకీచాన్‌ 'ది మిత్‌' సినిమా చేసినప్పుడు, అందులో బాలీవుడ్‌ భామ మల్లికా షెరావత్‌కి ఛాన్సిచ్చిన విషయం విదితమే. 

అన్నట్టు, 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో అమైరా దస్తూర్‌ కూడా నటిస్తోంది. అయినాసరే, దిశా పటానీ గ్లామర్‌ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుందట. ఈ సినిమాతో తాను హాలీవుడ్‌ అరంగేట్రం చేస్తున్నట్లేనని చెబుతోంది దిశాపటానీ. సినిమా సంగతెలా వున్నా, సినిమాకి సంబంధించిన స్టిల్స్‌లో రెడ్‌ హాట్‌గా దిశా పటానీ అందరి అటెన్షన్‌నీ తనవైపుకు తిప్పుకుంటోందన్నది నిర్వివాదాంశం.

Readmore!
Show comments