షెడ్యూల్ ముగిసింది.. ప్రశ్నలు మాత్రం మిగిలాయి

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో 4 రోజుల ముందే షెడ్యూల్ ముగించారు. నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తారు.

ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా రామ్ చరణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. చెర్రీ-సమంత మధ్య ఓ సాంగ్ కూడా పిక్చరైజ్ చేశారు. వీటితో పాటు పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్న సన్నివేశాల్ని కూడా షూట్ చేశారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ ముగిసినప్పటికీ చెర్రీ-సుక్కూ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రం అలానే మిగిలిపోయాయి.

రామ్ చరణ్ ఈ సినిమాలో చెవిటివాడిగా నటిస్తున్నాడనే వార్త మూవీ ఓపెనింగ్ నుంచి హల్ చల్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమాకు రేపల్లె అనే టైటిల్ పెట్టారంటూ ప్రచారం సాగుతోంది. వీటికి తోడు సినిమాలో చరణ్, చేపలుపట్టే వ్యక్తిగా కనిపించనున్నాడనే టాక్ కూడా ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియకుండానే ఫస్ట్ షెడ్యూల్ ముగించారు.

ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేసిన రష్ ను చిరంజీవికి చూపిస్తారు. ఫూటేజ్ లో కీలకమైన సన్నివేశాల్ని చిరంజీవి చూసి ఓకే చేసిన తర్వాత సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు.

Readmore!

Show comments