బాలయ్య కొత్త సినిమా పేరు అదే

బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించి దశలవారీగా క్లారిటీ ఇస్తున్నాడు దర్శకుడు పూరిజగన్నాధ్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన పూరి... సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని చూచాయగా చెప్పేశాడు. ఇప్పుడు టైటిల్ పై కూడా చిన్నపాటి క్లారిటీ ఇస్తున్నాడు. బాలయ్య కోసం పూరి ఓ వెరైటీ టైటిల్ పిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, బాలయ్య 101వ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను పూరిజగన్నాధ్ ఫిక్స్ చేసినట్టు టాక్. సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే హీరోయిన్ ఎవరనే విషయంతో పాటు ఈ టైటిల్ ను కూడా గ్రాండ్ గా ఎనౌన్స్ చేయాలని భావిస్తున్నాడట. ఏప్రిల్ మొదటివారంలో బాలకృష్ణ-పూరి జగన్నాధ్ సినిమా సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది. సో.. అప్పట్లోగా హీరోయిన్లను, టైటిల్ ను ఫైనల్ చేయాలని పూరిజగన్నాధ్ కు బాలకృష్ణ టార్గెట్ ఫిక్స్ చేశాడట. 

ప్రస్తుతం రోగ్ సినిమాకు ప్రచారం కల్పించే పనిలో పూరిజగన్నాధ్ బిజీగా ఉన్నాడు. ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే.. బాలయ్య 101వ సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ రాబోతోంది.

Readmore!
Show comments

Related Stories :