స్పైడర్ బడ్జెట్ పది కోట్లు పెరిగింది

మహేష్ బాబు కెరీర్ లోనే అత్యథిక బడ్జెట్ తో తయారవుతున్న సినిమా స్పైడర్. ఈ సినిమాను ప్లాన్ చేసినపుడు బడ్జెట్ 100 నుంచి 105 కోట్లు అనుకున్నారు. కానీ తమిళ వెర్షన్ కూడా డబ్బింగ్ మాదిరిగా కాకుండా, డైరక్ట్ వెర్షన్ గా తీయాలని అనుకోవడంతో, మరో పదికోట్లు పెరిగింది. పని రోజులు పెరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ మరో పదికోట్ల భారం పడుతోంది. దీనికి కారణం మరేమీ కాదు. సినిమా లో గ్రాఫిక్స్ పార్ట్స్ ను కాస్త హై ఫై క్వాలిటీతో చేయించాలని డిసైడ్ కావడమే.

బాహుబలి 2 తరువాత తీసుకున్న నిర్ణయం ఇది. దీంతో మకుట విఎఫ్ఎక్స్ సంస్థ రంగంలోకి వచ్చింది. టోటల్ గా పది కోట్ల బడ్జెట్ పెరిగింది. ఇప్పుడు టోటల్ బడ్జెట్ 130 దగ్గరకు చేరుకుంది.

ప్రస్తుతం చెన్నయ్ చెట్టినాడ్ హాస్పిటల్స్ లో సినిమా క్లయిమాక్స్ షూట్ జరుగుతోంది. కొంత షూట్ ను చెన్నయ్ స్టూడియోల్లో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. రెండుపాటలు మినహా మిగిలిన టాకీ జూన్ రెండు లేదా మూడు నాటికి పూర్తయిపోతుంది. ఆ తరువాత ఓ పాటను విదేశాల్లో, మరో పాటను సెట్ లో చిత్రీకరిస్తారు. మహేష్ సరసన రకుల్ నటిస్తున్న ఈ సినిమాకు మురుగసాద్ దర్శకుడు. టాగోర్ మధు, ఎన్ వి ప్రసాద్ నిర్మాతలు.

Show comments