ధృవ ను చుట్టేయకండి

ధృవ సినిమా విడుదల డేట్ ఇంకా నెల పైనే వుంది. కానీ చేయాల్సిన పనీ ఇంకా చాలానే వుంది. ఒక్క టాకీ, సాంగ్స్ అన్నీ కలిసి ఫిక్స్ చేసుకున్న కటాఫ్ డేట్ ఈ నెల నాలుగోవారానికి దగ్గర. ఇక అక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్. ఇవన్నీ కలిసి ఇక పరుగులు పెడితే తప్ప, ఫినిష్ కాని పరిస్థితి. ఇది తెలిసి, అభిమానులు, తొందరపడి రిలీజ్ డేట్ కోసం ధృవను చుట్టేయకండి అని అపీల్ చేస్తున్నారట. 

బ్రూస్ లీ విషయంలో ఇలా చేసే దెబ్బతిన్న సంగతిని గుర్తు చేస్తున్నారట. అంతే కాదు, ఎవరు ఎంత చెప్పినా సమ్మర్ దాటినా పూర్తి క్వాలిటీతో మగధీర ను అల్లు అరవింద్ తయారుచేసి, ఆలస్యంగానైనా విడుదల చేసి హిట్ చేసిన సంగతినీ గుర్తు చేస్తున్నారట. తొందరపడి, రిలీజ్ డేట్ కోసం కాంప్రమైజ్ అయిపోయి, ఏదో ఒకటి చుట్టేసి, ధృవలాంటి సినిమాను పాడు చేయవద్దని అభిమానులు నేరుగా అల్లు అరవింద్ కే చెప్పినట్లు వినికిడి. 

రిలీజ్ డేట్ కోసం అరవింద్ గాబరాపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో వారు ఇలా చేసినట్లు తెలుస్తోంది. తనకేమీ గాభరాలేదని, దర్శకుడు కావాలంటే టైమ్ తీసుకోవచ్చని, వారికి అరవింద్ క్లారిటీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మరి చరణ్-సురేందర్ రెడ్డి కలిసి ఏం చేస్తారో?

Show comments