బల్గేరియాకు పవన్

బల్గేరియా అనగానే జనాలకు టక్కున బాహుబలి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే బాహుబలి పార్ట్ వన్ షూటింగ్ జరుపుకున్న ఏకైక విదేశీ లోకేషన్ అది మాత్రమే. ఇప్పుడు అదే లోకేషన్లకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారట.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా 60 శాతానికి పైగా పూర్తయింది. ఒకటి రెండు రోజుల్లో శంషాబాద్ దగ్గర ఓ పేద్ద ఇంటి లొకేషన్ కు షిప్ట్ అవుతుంది. 

అక్కడ షెడ్యూలు తరువాత పాటల కోసం బల్గేరియా పయనమై వెళ్తారట. ఇందుకోసం బల్గేరియాలోని మాంచి లోకేషన్లను ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయిడెంటిఫై చేసి వుంచారట. అందుకు తగ్గట్లే తొలిసారి తెలుగు సినిమా చేస్తున్న తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ మాంచి బాణీలు కట్టి సిద్దంగా వుంచారట.

ఇంకా టైటిల్ డిసైడ్ కానీ ఈ సినిమాకు రివెంజ్ డ్రామా కీలకం. భారీ సెట్టింగ్ లు, విజువల్ ఎఫెక్ట్ లతో తయారవుతున్న ఈ సినిమాకు బడ్జెట్ దగ్గర దగ్గర వంద కోట్లకు పైగానే. త్రివిక్రమ్, పవన్ ఇద్దరి కెరీర్ లో ఇంత హయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఇంతవరకు రాలేదు.

Show comments