సూపర్‌స్టార్‌ శకం ముగిసినట్టేనా?

'రెయిస్‌'తో అవలీలగా రెండు వందల కోట్లు వసూలు చేస్తాడని అనుకున్న కింగ్‌ ఖాన్‌ మళ్లీ భంగపడ్డాడు. ఈ చిత్రం రెండు వందల కోట్లు తెచ్చుకోవడం అటుంచి, 'దిల్‌ వాలే' ఇండియాలో వసూలు చేసిన నూట నలభై కోట్ల నెట్‌ వసూళ్లని కూడా తెచ్చుకోలేకపోయింది. 

రెండవ వారంలో 'రేయిస్‌' కంటే 'కాబిల్‌' వసూళ్లే బెటర్‌గా వున్నాయని ట్రేడ్‌ చెబుతోంది. అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ కంటే ఎంతో ఎత్తులో వుండి, వరుస బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన 'బాద్షా' శకం ముగిసిందా? ఇక షారుక్‌ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదా? 'లవర్‌బాయ్‌' ఇమేజ్‌తోనే ఇన్నాళ్లూ నెగ్గుకొచ్చిన షారుక్‌కి నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్లడం కుదరడం లేదు.

కమర్షియల్‌ చిత్రాలు చేస్తూ సేఫ్‌ జోన్‌లో వుండాలనే ప్రయత్నం తేడా కొట్టింది. హ్యాపీ న్యూ ఇయర్‌, దిల్‌వాలే లాంటి చిత్రాలు అతడి సినిమాలపై నమ్మకం పోగొట్టాయి. ఫాన్‌, డియర్‌ జిందగీ లాంటి ప్రయోగాలు అతని స్టార్‌డమ్‌ని ఎఫెక్ట్‌ చేసాయి. త్వరలో బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడనే నమ్మకం కలిగించే ప్రాజెక్టులు కూడా షారుక్‌ దగ్గర లేవు. మరి ఈ ఆల్‌టైమ్‌ లో నుంచి మళ్లీ శిఖరానికి చేరే దారిని కింగ్‌ ఖాన్‌ ఎలా కనుక్కుంటాడో చూడాలి. 

Show comments