చైతూ డేట్ల కోసం బోయపాటి స్కెచ్?

సినిమా తరువాత సినిమా లైన్ లో వుంటేనే ఎవరైనా లైమ్ లైట్ లో వుండేది. కానీ హీరోలు ఎంత మంది వున్నా, కొంతమంది డైరక్టర్లు ఖాళీగానే వుండాల్సి వస్తోంది. అది కూడా హిట్ ఇచ్చానా? ఖైదీ 150 లాంటి హిట్ ఇచ్చినా వినాయక్ కు సినిమా సెట్ కాలేదు.

అందుకే దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ముందు జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన సై అంటే సై అనే బాలయ్య బాబు ప్రస్తుతం ఖాళీ లేరు. బన్నీ మరో సినిమా చేయాలి అంటే ఇంకా చాలా దూరం వుంది?

మరి ఎవరు ఖాళీ వున్నారు? కనుచూపు మేరలో ఏ హీరో ఖాళీ లేరు. అందుకే బోయపాటి కన్ను నాగ్ చైతన్య మీద పడినట్లు కనిపిస్తొంది. నిన్నటికి నిన్న అన్ని వెబ్ సైట్లలో ఓ గ్యాసిప్ టక్కున ప్రత్యక్షమైంది.

నాగార్జున భారీ ఆఫర్ బోయపాటికి ఇచ్చేసాడు. చైతన్యతో సినిమా చేయమంటూ అనే ఆ గ్యాసిప్ వట్టి గ్యాసిప్ మాత్రమే అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. చైతన్యను మాస్ సినిమా వైపు ఇప్పట్లో నడిపించే ఆలోచనలో నాగ్ లేనే లేడట.

అయితే  మరెలా పుట్టింది ఈ వార్త అంటే, ప్రస్తుతం చైతన్య సినిమా ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. తరువాతి సినిమా ఫిక్సయింది కానీ ఇంకా ముహుర్తం కాలేదు.

అందుకే ఈ గ్యాప్ లో దూరడానికి చాన్స్ వుంటుందేమో? అని బోయపాటి క్యాంప్ నుంచే ఈ వార్త పుట్టి వుంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ చైతన్య మాత్రం మైత్రీ మూవీస్-చందు మొండేటి సినిమాకే ఫిక్స్ అయిపోయాడట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లు గట్టిగా ట్రయ్ చేస్తున్నా కూడా ఊ.. ఆ అనడం లేదట. అదీ సంగతి.

అన్నట్లు డిజె తరువాత హరీష్ శంకర్ కూడా కొన్నాళ్లయినా ఖాళీగా వుండక తప్పదు. ఎందుకంటే కనుచూపు మేరలో ఏ హీరో ఖాళీగా లేరు.

Show comments