ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కాకినాడ వెళ్లారు. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ ఆంధ్రలోకి వెళ్లడం చాలా కాలం తరువాత ఇదే. వీరిద్దరే కాదు, టోటల్ నందమూరి హరికృష్ణ ఫ్యామిలీ అంతా ఇప్పడు అక్కడే వున్నారు. దీనికి కారణం మరేమీ కాదు. హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ కొడుకుకు అక్కడ పంచెకట్టే ఫంక్షన్ జరుగుతోంది.
జానకిరామ్ అత్తగారి ఊరు కాకినాడకు సమీపంలోనే పల్లెటూరు. అంతే కాదు, హరికృష్ణ కూతరు అత్తవారి ఊరు కూడా కాకినాడే. ఆ మాటకు వస్తే బాలయ్య అత్తవారి ఊరు కూడా కాకినాడే కావడం విశేషం. సో, ఇప్పుడు హరికృష్ణ మనవడి ఫంక్షన్ కాకినాడలో జరుగుతోంది కాబట్టి, దీనికి అటెండ్ అయ్యేందుకు వీలుగా అందరూ బయల్దేరి వెళ్లారు.
రాజమండ్రి వరకు ఫ్లయిట్ లో వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ నుంచి రోడ్ మార్గాన కాకినాడ వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు అటు రాజమండ్రి నుంచి ఇటు కాకినాడ వరకు బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేసారు.