సర్దార్ సెంటిమెంట్ తో ఆఫీస్ మారిందా?

సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాణం ఆది నుంచి అంతం వరకు ఓ పెద్ద పజిల్.. ఎప్పుడు కదులుతుందో.. ఎప్పుడు ఆగుతుందో? ఆఖరికి నిరాశే మిగిల్చింది నిర్మాత శరద్ మురార్ కు. ఆ తరువాత మరో సినిమా మళ్లీ పవర్ స్టార్ తో ప్రారంభించారు. దాని పరిస్థితీ అంతే. 

డైరక్టర్ ఎస్ జె సూర్య మారిపోయారు. డాలీ సీన్ లోకి వచ్చారు. అయినా సినిమా ఎప్పుడు సార్ట్ అవుతుందో అన్నది తెలియదు. మరి ఇదంతా చూస్తుంటే నిర్మాత శరద్ మురార్ కు సెంటిమెంట్లు గుర్తుకు వచ్చినట్లు ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆఫీసు మారిస్తేనన్నా ఫలితం వుంటుందేమో అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అందుకే ఫిల్మ్ నగర్ లో నందమూరి లక్ష్మీపార్వతి ఇంటి పక్కన వున్న కార్యాలయాన్ని ఖాళీ చేసి, ప్రశాసన్ నగర్ లో వేరే కార్యాలయంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ జోష్ తో ఈ నెలాఖరుకు డాలీ-పవర్ స్టార్ కాంబినేషన్ లోని సినిమా సెట్ మీదకు వెళ్లబోతోంది.

Show comments