రోబో 2 కు 110 కోట్లా? బాబోయ్?

సినిమా ట్రేడ్ రాను రాను అందనంత ఎత్తుకు ఎదిగిపోతోంది. సినిమాకు జనాలిచ్చే టికెట్ డబ్బుల సంగతి అలా వుంచితే డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ మొత్తాలు వస్తున్నాయి. దిగ్ దర్శకుడు శంకర్-సూపర్ స్టార్ రజనీ కాంబో సెన్సేషనల్ మూవీ రోబో 2.0. ఈ సినిమా టోటల్ శాటిలైట్ హక్కులను జీటీవీ, లైకా ప్రొడక్షన్స్ కలిసి 110 కోట్లకు కొన్నాయి అన్న వార్త సినిమా ఇండస్ట్రీలో సంచలనాలకు తెరలీసింది. జీ టీవీ నూట పది కోట్లకు కొనడమే ఓ విశేషం అనుకుంటే, తొలిసారి శాటిలైట్ హక్కుల్లో చానెల్ తో పాటు నిర్మాణ సంస్థ భాగస్వామ్యం తీసుకోవడం కూడా విశేషమే.

రోబో 2.0 సినిమా మీద భయంకరమైన అంచనాలు వున్నాయి. శంకర్ కు వున్న క్రేజ్, రజనీకి వున్న చరిష్మా, ప్రపంచ వ్యాప్తంగా వున్న తమిళ, తెలుగు ప్రేక్షకుల సంఖ్య, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కలిసి ఈ సినిమా మార్కెట్ ను వందల కోట్లకు చేర్చేసాయి. దీనికి తోడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర ధారి కావడంతో బాలీవుడ్ మార్కెట్ కూడా తోడయింది. 2017 ప్రారంభంలో తెలుగు సినిమా బాహుబలి 2 ఓ సంచలనం అయితే ఆ తరువాత మళ్లీ అంతటి సంచలనం రోబో 2.0 నే. ఈ సినిమా బడ్జెట్ నే 400 కోట్లు. భారత సినిమా రంగంలో అత్యంత భారీ సినిమా ఇదేనేమో?

Readmore!
Show comments