కన్నడ రంగంలోకి ఆది?

ఆది సాయి కుమార్..తెలుగునాట వరుస సక్సెస్ లతో ఎంట్రీ ఇచ్చిన హీరో. కానీ ఆ తరువాత సిక్స్ ప్యాక్, మాస్ మసాలా సినిమాలంటూ ప్రయోగాలు చేసి కెరీర్ ను గాడి తప్పించుకున్నాడు. ప్రస్తుతం వీరభద్రమ్ చౌదరితో చుట్టాలబ్బాయి సినిమా చేస్తున్నాడు. ఇదొక్కటే హోప్. 

ఇదిలా వుంటే సాయికుమార్ కు తన కొడుకు ఆదిని కన్నడ రంగానికి పరిచయం చేయాలనే ఆలోచనలో వున్నట్లు వినికిడి. సాయి కుమార్ కు టాలీవుడ్ మంచి నటుడిగా ఎంత పేరు వుందో, కన్నడ రంగంలో కూడా అంతే పేరు వుంది. హీరోగా కూడా గుర్తింపు వుంది. అందుకే తన కొడుకు ను కూడా కన్నడ రంగానికి పరిచయం చేయాలని అనుకుంటున్నారు సాయికుమార్ అని తెలుస్తోంది.  

నిఖిల్ సూపర్ హిట్ మూవీ కార్తికేయను కన్నడంలోకి ఆది హీరోగా రీమేక్ చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంచి సబ్జెక్ట్..మంచి నిర్ణయమే అనుకోవాలి. తెలుగునాట హీరోల ప్లానింగ్ ఎంత ముఖ్యమో, వారికి బ్యాకింగ్ కూడా అంతే ముఖ్యం. ఆదికి టాలీవుడ్ లో అది లేదు. కన్నడ ఫీల్డ్ లో అయితే ఈ సమస్య అంతగా వుండదు.

Show comments