ఈ పిల్ల రూటే సెపరేటు

హీరోయిన్లకు బాగా డబ్బులొస్తే ఏం చేస్తారు. బంగళాలు కొనుక్కుంటారు లేదంటే బొటిక్స్ పెట్టుకుంటారు. ఇంకాస్త రిస్క్ చేయాలనుకుంటే తామే నిర్మాతలుగా మారి సినిమాలు కూడా తీస్తారు. కానీ రకుల్ రూటే సెపరేటు. ఈ భామ మాత్రం తనకు బాగా ఇష్టమైన వ్యాపకాన్నే వ్యాపారంగా మార్చేసుకుంటోంది. 

రకుల్ ప్రీత్ సింగ్, ఫిట్ నెస్ ఫ్రీక్ అనే అనే విషయం తెలిసిందే. మార్నింగ్ లేచిన వెంటనే కసరత్తులు చేయకపోతే తనకు ఏదోలా ఉంటుందని ఓ సందర్భంలో రకుల్ స్వయంగా స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. తన గ్లామర్ సీక్రెట్ కూడా అదేనని చెప్పుకొచ్చింది. అలా తనకు ఎంతో ఇష్టమైన ఎక్సర్ సైజ్ కాన్సెప్ట్ నే బిజినెస్ గా కూడా మార్చుకుంది ఈ బ్యూటీ. 

హైదరాబాద్ లో ఇప్పటికే ఓ లగ్జరీ జిమ్ స్థాపించిన రకుల్.. ఇప్పుడు విశాఖపై ఫోకస్ పెట్టింది. ఉక్కునగరంలో కాస్ట్ లీ ఏరియాగా పేరుతెచ్చుకున్న దసపల్లా హిల్స్ ప్రాంతంలో జిమ్ ఏర్పాటుచేసింది. ఈనెల 17న రకుల్ చేతుల మీదుగా ఈ జిమ్ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భవిష్యత్తులో ఇంకెన్ని బ్రాంచ్ లు తెరుస్తుందో చూడాలి.

Show comments